హైదరాబాద్ వ్యాపారి ఇంట్లో పూసిన బ్రహ్మకమలం!

  • యాప్రాల్ లో ఉంటున్న కవిత దంపతులు
  • నాటిన మొక్క పెరిగి పూసిన బ్రహ్మ కమలాలు
  • సెల్ఫీలు దిగేందుకు స్థానికుల ఆసక్తి
భాగ్యనగరిలో అరుదైన బ్రహ్మ కమలాలు విరబూశాయి. వీటిని చూసేందుకు ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు. యాప్రాల్ పరిధిలోని కల్యాణ్ పురి కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త కవిత దంపతుల ఇంట్లో ఒకేసారి ఐదు బ్రహ్మ కమలాలు పూశాయి. గతంలో తీసుకుని వచ్చి నాటిన మొక్క ఎదిగి పూలు పూయడంతో వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చుట్టుపక్కల ఉన్న వారు ఎంతో మంది ఆ పూలను ఫోటోలు తీసేందుకు, వాటితో సెల్ఫీలు దిగేందుకు వస్తుండటంతో, కవిత ఇల్లు ఇప్పుడు సందడిగా కనిపిస్తోంది.


Brahma Kamalam
Hyderabad
Kavitha
Business Man

More Telugu News